నిశ్శబ్దం ట్రైలర్ వచ్చేసింది

0
42
nishabdham movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ అందాల భామ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ తన మిత్రుడు విశ్వప్రసాద్ తో కలిసి నిర్మించడం విశేషం. అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో సాగడంతో ప్రేక్షకులకు అమితంగా నచ్చేలా కట్ చేసారు. ఈ చిత్రంలో అనుష్క మూగ , చెవిటి యువతిగా నటిస్తోంది.

పూర్తిగా అమెరికాలో నిర్మించిన ఈ చిత్రాన్ని 5 భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల కానుంది. అసలు ఈ సినిమాని థియేటర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ కరోనా వల్ల విడుదల ఆగిపోయింది దాంతో ఇంకా వెయిట్ చేయడం వల్ల సినిమాపై ఉన్న అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. ఇక అమెజాన్ కూడా మంచి రేటు ఇవ్వడంతో ఓటీటీ విడుదలకు అంగీకరించారు.

ఈరోజు కొద్దిసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ తో నిశ్శబ్దం చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఓటీటీలో సాలిడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుష్క కు ఒక స్టార్ హీరో కు ఉండేంత స్టార్ డం ఉన్న హీరోయిన్ కావడంతో తప్పకుండా నిశబ్దం చిత్రానికి వ్యూస్ బాగా రావడం ఖాయం. ఇక సినిమా ప్రేక్షకులకు నచ్చితే బ్లాక్ బస్టర్ ని చేస్తారు. ఓటీటీ లో విడుదల అవుతున్న మొట్టమొదటి భారీ చిత్రం ఈ నిశ్శబ్దం. మొట్టమొదటి భారీ చిత్రం కాబట్టి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నాడు రచయిత , నిర్మాత కోన వెంకట్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి