నిర్మాతగా మారుతున్న ప్రభాస్ చెల్లి

0
33

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెల్లి నిర్మాతగా మారుతోంది. అదేంటి ప్రభాస్ కు తోడ బుట్టిన చెల్లి లేదు కదా అని అనుకుంటున్నారా? ప్రభాస్ పెద్ద నాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ముగ్గురు కూతుర్లు అందులో పెద్ద కూతురు ప్రసీదా నిర్మాతగా మారుతోంది. గోపికృష్ణా మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు గతంలో. అప్పట్లో ఈ బ్యానర్ కింద నిర్మించిన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు ప్రభాస్ నాన్న యువి సూర్యనారాయణ రాజు. అయితే అనారోగ్యంతో ప్రభాస్ తండ్రి చనిపోయినప్పటి నుండి ఆ బ్యానర్ పై పెద్దగా చిత్రాలు రాలేదు. అయితే మధ్యలో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా చిత్రాన్ని నిర్మించారు.

కట్ చేస్తే తండ్రి వారసత్వం అలాగే అన్నయ్య ప్రభాస్ అండదండలతో నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది ప్రసీదా. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది ప్రసీదా. తాజాగా వచ్చిన రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ లో ప్రసీదాని కూడా ఒక నిర్మాతగా ప్రకటించారు. అంటే ఈ లెక్కన ప్రభాస్ చెల్లి ప్రసీదా కూడా నిర్మాత అయినట్లే. అన్నయ్యకు వరల్డ్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి చెల్లి పెట్టుబడులకు ఎలాంటి డోకా లేదు పైగా మంచి లాభాలు కూడా రావడం ఖాయం. సినిమా ఎలా ఉన్నా లాభాలు మాత్రం పిండుకోవడం ఖాయం అందుకే నిర్మాతగా మొదటి వెంచర్ తోనే సక్సెస్ అవుతుందన్న మాట ప్రసీదా.  

మునుపటి వ్యాసంరౌడీ తమ్ముడి సినిమా టైటిల్ ఏంటో తెలుసా
తదుపరి ఆర్టికల్ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్న విలన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి