సీనియర్ నటి కన్నుమూత

0
18
Nimmi aka nawab banoo passes away

బాలీవుడ్ సీనియర్ నటి నిమ్మి( 87) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నిమ్మి కి గుండెపోటు రావడంతో నిన్న రాత్రి ముంబై లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. నిమ్మి అసలు పేరు నవాబ్ బానూ. కాగా నిమ్మి మరణంతో సీనియర్ నటులు రిషి కపూర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసాడు. నిమ్మి తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నాడు రిషి కపూర్.

అలాగే దర్శకులు మహేష్ భట్ కూడా నిమ్మి మృతి పై స్పందించాడు. నిమ్మి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 87 ఏళ్ల నిమ్మి బాలీవుడ్ లో 1950 – 60 కాలంలో స్టార్ గా వెలుగొందారు. దశాబ్ద కాలం పాటు పలు చిత్రాల్లో నటించిన నిమ్మి మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే నిమ్మి మృతి చెందినప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో ఆమె పార్దీవ దేహాన్ని కూడా చూసేందుకు వెళ్లలేక పోతున్నారు. ఈరోజు నిమ్మి అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి