కరోనాకు భయపడేది లేదంటున్న నిఖిల్

0
14
Nikhil is not afraid of Coronavirus

కరోనా కు భయపడేది లేదు , నా పెళ్లి వాయిదా వేసేది లేదంటున్నాడు హీరో నిఖిల్. వచ్చే నెలలో నిఖిల్ పెళ్లి జరుగనుంది. ఇంతకుముందే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు పెళ్లి గురించి అయితే కరోనా ఎఫెక్ట్ ఎక్కువ కావడంతో నిఖిల్ పెళ్లి రద్దు కాబోతోంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో హీరో నిఖిల్ స్పందించాడు. కరోనాకు భయపడను , పెళ్లి ఆపేది లేదు ఒకవేళ కరోనా మరింతగా ముదిరితే కనీసం గుడిలోనైనా పెళ్లి చేసుకుంటాను కానీ పెళ్లిని వాయిదా వేసేది లేదని కుండబద్దలు కొట్టాడు నిఖిల్.

హీరో డాక్టర్ పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. గతనెలలో నిఖిల్డాక్టర్ పల్లవి వివాహ నిశ్చితార్థం జరిగింది. ఇక వచ్చే నెలలో పెళ్లి అనుకున్నారు కానీ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో తెలంగాణలో సినిమాహాళ్లు , ఫంక్షన్ హాళ్లు , కళాశాలలు , పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించానని అందుకే పెళ్లి ఆపేది లేదని తేల్చి చెప్పాడు నిఖిల్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి