పసుపు దంచిన నిహారిక : పెళ్లి పనులు షురూ

0
77
niharika konedala

మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులు షురూ అయ్యాయి. నిన్న సోమవారం రోజున పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టారు. నిహారికతో పాటుగా నిహారిక తల్లి కూడా ఈ పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంది. నిహారిక పసుపు దంచే క్రమంలో మరింత అందంగా కనిపించింది. పెళ్లి కళ వచ్చేసింది కాబట్టి ఆ రకంగా కూడా మరింత అందంగా చూడముచ్చటగా కనిపిస్తోంది నిహారిక. తెలుగువారి ఇళ్లల్లో పెళ్లి పనుల్లో పసుపు దంచే కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం. అయితే ఈ ఘట్టంలో అందరూ ఆడవాళ్లు మాత్రమే పాల్గొంటారు. ఇక ఈ పసుపు కొమ్ములు దంచే కార్యక్రమాన్ని వీడియో తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.konedala niharika

konidela family

ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిహారిక హీరోయిన్ గా నటించింది కాబట్టి సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దానికి తోడు మెగా కుటుంబం అనే స్టాంప్ ఎలాగూ ఉంది కాబట్టి నిహారిక వీడియో వైరల్ అవుతోంది. ఇటీవలే నిహారిక వివాహ నిశ్చితార్థం జొన్నలగడ్డ చైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ జరిగింది , అలాగే పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి కానీ పెళ్లి రోజు ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

నిహారిక వివాహ నిశ్చితార్ధ వేడుకకు మెగా కుటుంబం మొత్తం హాజరయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చాతుర్మాస దీక్షలో ఉన్నాడు కాబట్టి ఎంగేజ్ మెంట్ రోజున ఉదయమే వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి వెళ్ళాడు. కానీ నిహారిక ఎంగేజ్ మెంట్ కు పవన్ కళ్యాణ్ రాలేదు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొద్దున్నే వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు అని తెలుసుకుని మళ్ళీ మరో కథనం రాసారు పలువురు. 

మునుపటి వ్యాసంఆ హీరోకు లిప్ లాక్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిందట
తదుపరి ఆర్టికల్పుకార్లపై మండిపడిన సురేఖావాణి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి