కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న విజయ్

0
75

ఇళయ దళపతి విజయ్ తమిళనాట కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఊతమిచ్చేలా హీరో విజయ్ తండ్రి దర్శకుడు చంద్రశేఖర్ ఢిల్లీలో మకాం వేయడంతో ఈ ఊహాగానాలు చెలరేగాయి. మాంచి లాయర్ ని వెంటపెట్టుకొని పూర్తి న్యాయసలహాలు పాటిస్తూ కొత్త రాజకీయ పార్టీని తమిళనాట ప్రారంభించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ని కలిశాడట విజయ్ తండ్రి చంద్రశేఖర్. కొత్తగా ఏ రాష్ట్రంలో అయినా సరే రాజకీయ పార్టీ పెట్టాలంటే కేంద్ర ఎన్నికల సంఘంలో తమ పార్టీ వివరాలతో పాటుగా ఇతర పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. అందుకే ఆ పని మీద విజయ్ తండ్రి ఢిల్లీ లో మకాం వేసినట్లుగా తెలుస్తోంది.

హీరో విజయ్ కి రాజకీయ పార్టీ పెట్టాలని ఉందో ? లేదో ? కానీ విజయ్ తండ్రి చంద్రశేఖర్ కు మాత్రం విజయ్ రాజకీయాల్లోకి రావాలి , కొత్త పార్టీ పెట్టాలని గత నాలుగైదుఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విజయ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దాంతో నా కొడుకు తప్పకుండా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాడని గట్టిగా నమ్ముతున్నాడు చంద్రశేఖర్. అందుకే తెరవెనుక  ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. తమిళనాట జయలలిత , కరుణానిధి ఉన్నంత వరకు డీఎంకే , అన్నా డీఎంకే పార్టీలదే హవా కానీ ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు కూడా లేరు దాంతో ఇదే సరైన అవకాశం అని భావిస్తున్నాడు విజయ్ తండ్రి.

దీనికి ఊతమిచ్చేలా ఇటీవల పలు సంఘటనలు విజయ్ ని బాధించాయి తీవ్రంగా అందుకే ఆ కసితోనే విజయ్ కి రాజకీయాల్లోకి రావాలని అనిపించిందట. ఇటీవల పలుమార్లు విజయ్ ఇంటిపై , అలాగే విజయ్ కి సంబందించిన దర్శక నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఇలా ఐటీ దాడులు జరగడానికి కారణం కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలతో పాటుగా తమిళనాడు సర్కార్ కూడా కారణమని కోపంగా ఉన్నాడు విజయ్. అందుకే రాజకీయ పార్టీ పెట్టేలా సన్నాహాలు చేస్తున్నాడట. తమిళనాట వచ్చే ఏడాది ఆఖరున అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టగా , రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 

మునుపటి వ్యాసంహీరో రామ్ కు వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ
తదుపరి ఆర్టికల్ఎన్టీఆర్ సినిమాలో మళ్ళీ ఆ స్టార్ హీరో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి