నెటిజన్లను ఆకర్షిస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్

0
60
ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ నెటిజన్ల ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎస్ ఎస్ రాజమౌళి కొమరం భీమ్ గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ , అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న రాంచరణ్ ల చేతులను పట్టుకొని ముందుకు కదులుతున్న కార్టూన్ పోస్టర్ వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఈ ముగ్గురి గెటప్ లు కూడా కార్టూన్ లో మరింత అందంగా ఉన్నాయి దాంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్లకు సోషల్ మీడియాలో ఆదరణ బాగానే లభిస్తోంది. అలాగే తమ ప్రతిభా పాటవాలను చూపించడానికి చక్కటి మార్గం కూడా కావడంతో ఇలా ఫ్యాన్ మేడ్ పోస్టర్ లు చాలానే వస్తున్నాయి.

దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఆర్ ఆర్ ఆర్. కరోనా ఎఫెక్ట్ తో దాదాపు నాలుగు నెలలుగా షూటింగ్ లు లేకుండాపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , చరణ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి.

మునుపటి వ్యాసంప్రభాస్ ద్విపాత్రాభినయం పోషించనున్నాడా
తదుపరి ఆర్టికల్జగన్ కు లేఖ రాసిన బాలయ్య అందులో ఏముందంటే
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి