అనుష్క నిశ్శబ్దం పై నెగెటివ్ ప్రచారం

0
37
anushka nishabdham movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ అందాల భామ అనుష్క నిశ్శబ్దం చిత్ర యూనిట్ పై అసంతృప్తితో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నట్లు కథనాలు వడ్డి వారుస్తున్నారు కొంతమంది . హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్ – కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. అసలు ఈ చిత్రాన్ని థియేటర్ లలో విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా వల్ల థియేటర్ లలో కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున నిశ్శబ్దం చిత్రం తెలుగు , తమిళ , మలయాళం , హిందీ , కన్నడ భాషల్లో విడుదల కానుంది అమెజాన్ లో.

అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించగా కీలక పాత్రల్లో మాధవన్ , అంజలి , షాలిని పాండే, సుబ్బరాజు  తదితరులు నటించారు. అయితే ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కి దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా అనుష్క మీడియా ముందుకు రాకపోవడంతో నీలినీడలు కమ్ముకున్నాయి. దానికి తోడు ఇలాంటి వాటిని పెద్దవి చేసి చూపించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక నిశ్శబ్దం చిత్రంపై అప్పుడే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అయితే అనుష్క నిశ్శబ్దం కోసం బిగ్ బాస్ 4 హౌజ్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సినిమా ప్రమోషన్ కోసం ఇప్పుడు మీడియా ముందుకు రావడం కష్టం కాబట్టి బిగ్ బాస్ 4 హౌజ్ లోకి వెళ్లడం ద్వారా తన చిత్ర ప్రమోషన్ కు మంచి స్కోప్ ఉంటుందన్న విశ్వాసంతో ఉందట అనుష్క. అయితే ఇవేవి పట్టని కొంతమంది నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారు అప్పుడే. అయితే అనుష్క మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోవాలని ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటోందట. మొత్తానికి ఏదైతేనేం అనుష్క నటించిన నిశ్శబ్దం అక్టోబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి