ఆగస్టు 13 న నిహారిక ఎంగేజ్ మెంట్ ?

0
20
మెగా డాటర్ నిహారిక ఎంగేజ్ మెంట్ ఆగస్టు 13 న జరుగనున్నట్లు తెలుస్తోంది. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్య తో నిహారిక వివాహం జరుగనుంది. జొన్నలగడ్డ చైతన్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ అతడి కుటుంబం పోలీసు అధికారి కావడం విశేషం. ఇప్పటికే నిహారిక – జొన్నలగడ్డ చైతన్య ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆగస్టు 13 న కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో నిహారిక – చైతన్య ల వివాహ నిశ్చితార్థం జరుగనుందట. కరోనా ఉధృతి నేపథ్యంలో తక్కువమంది సమక్షంలో ఈ కార్యక్రమం చేయనున్నారట.

అలాగే పెళ్లికి కూడా కోవిడ్ నిబంధనలను అనుసరించి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది మా ఇంటి వ్యవహారం కాబట్టి తక్కువ మందినే పిలుస్తున్నాం. ఇది పబ్లిక్ ఫంక్షన్ కాదు కదా ! అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు నాగబాబు. హీరోయిన్ గా ఓ వెలుగు వెళగాలని ఆశపడింది నిహారిక కానీ ఆ భామ ఆశలన్నీ నీరుగారిపోయాయి వరుస పరాజయలతో. దాంతో ఇలా పెళ్లికి సిద్ధమైపోయింది.  

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి