రకుల్ ఫోన్ ని సీజ్ చేసిన ఎన్సీబీ

0
44
rakul preeth ncb ,drugs case

టాలీవుడ్ మూవీ న్యూస్, ముంబయి- హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సెల్ ఫోన్ ని సీజ్ చేసారు ఎన్సీబీ అధికారులు. డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విరుచుకుపడింది రకుల్ కట్ చేస్తే ఎన్సీబీ అధికారులు రకుల్ కు నోటీసులు ఇవ్వడం , విచారణకు హాజరు కావడం జరిగింది. ముంబైలో విచారించిన ఎన్సీబీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత మరింత సమాచారం కోసం రకుల్ ప్రీత్ సింగ్ సెల్ ఫోన్ ని సీజ్ చేసారు అధికారులు.

డ్రగ్స్ బ్యాచ్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో రకుల్ ప్రీత్ సింగ్ చాటింగ్ కూడా చేసింది అలాగే డ్రగ్స్ గురించి మాట్లాడింది కూడా. అయితే విచారణలో మాత్రం నేను డ్రగ్స్ తీసుకోలేదు కానీ చాటింగ్ మాత్రం చేశాను అని చెప్పడంతో ఆమె సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎవరెవరితో చాటింగ్ చేసిందో తేల్చే పనిలో పడ్డారు ఎన్సీబీ అధికారులు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా దీపికా పదుకోన్ , సారా అలీఖాన్ , శ్రద్దా కపూర్ లను కూడా విచారించారు.

అయితే దీపికా పదుకోన్ ఎన్సీబీ అధికారులకు సహకరించలేదని తెలుస్తోంది. దాంతో దీపికా పదుకోన్ ని మళ్ళీ విచారించనున్నారట ఎన్సీబీ అధికారులు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తు ఇలా కీలక మలుపులు తిరుగుతూ డ్రగ్స్ వైపు మళ్లింది. ఈ డ్రగ్స్ కేసులో పలువురు హీరోయిన్ లు ఇబ్బంది పడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది ఇలాంటి సమయంలో ఆమె కెరీర్ కు కొంత ప్రతిబంధకమనే చెప్పాలి ఈ డ్రగ్స్ కేసు. 

మునుపటి వ్యాసంబాలుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్
తదుపరి ఆర్టికల్నన్ను కేసీఆర్ ట్రాప్ చేసాడు : డి. శ్రీనివాస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి