నటి రాధా ప్రశాంతి పై కేసు నమోదు

0
42
TMN logo
TMN logo


సినీ నటి రాధా ప్రశాంతి పై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదు అయ్యింది. ఇంతకీ రాధా ప్రశాంతి పై ఎందుకు కేసు నమోదు అయ్యిందో తెలుసా…… కారుతో ఓ మహిళ ను గుద్దడమే కాకుండా ఆ తతంగమంతా సెల్ ఫోన్ లో బందించినందుకు గాను ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని దుర్భాషలు ఆడినందుకు. సంఘటన వివరాలలోకి వెళితే….. బంజారాహిల్స్ లో ఓ మహిళని తన కారుతో యాక్సిడెంట్ చేసింది నటి రాధా ప్రశాంతి. యాక్సిడెంట్ చేయడమే కాకుండా ఆ మహిళనే తిడుతుండటంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ విషయాన్ని తన కెమెరాలో షూట్ చేసాడు.

దాంతో చిర్రెత్తుకొచ్చిన రాధా ప్రశాంతి సదరు సాఫ్ట్ వేర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అతడి సెల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేసింది. దాంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు సదరు సాఫ్ట్ వేర్. అలాగే యాక్సిడెంట్ కు గురైన మహిళ కూడా రాధా ప్రశాంతి పై కేసు పెట్టింది. జరిగిన సంఘటనలతో రాధా ప్రశాంతి పై కేసు పెట్టామని , అయితే విచారణ చెప్పటి అసలు విషయాలను తెలుసుకుందామని , బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు పోలీసులు. తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది రాధా ప్రశాంతి. 90 – 2000 ల మధ్య కాలంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కాలం నుండి పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి