నాని కి వార్నింగ్ ఇస్తున్నారా ?

0
30
Nani’s next film copying garshana movie

హీరో నాని కి వార్నింగ్ ఇస్తున్నారు ఘర్షణ చిత్ర హక్కుదారులు. 1988 సంవత్సరంలో రిలీజ్ అయిన ఘర్షణ తెలుగులో సంచలన విజయం సాధించింది. అయితే ఇది తెలుగు సినిమా కాదు తమిళ సినిమా ఇక తమిళంలో అయితే ఇంకా పెద్ద హిట్ అయ్యింది అగ్ని నక్షత్రం అనే టైటిల్ తో విడుదల అయ్యింది అక్కడ. కార్తీక్ , ప్రభు , నిరోషా , అమల తదితరులు నటించిన చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించాడు.

కట్ చేస్తే ఘర్షణ సినిమా కథని పోలిన కథతో హీరో నాని సినిమా చేస్తున్నాడని తెలియడంతో సదరు సినిమా హక్కుదార్లు మా సినిమాలోని సన్నివేశాలను కానీ డైలాగ్స్ ని కానీ కాపీ కొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు జారీ చేసారు. నాని తాజాగా టక్ జగదీశ్ అనే చిత్రం చేస్తున్నాడు. సినిమా కథ ఘర్షణ చిత్రాన్ని పోలి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి దాంతో వార్నింగ్ లు ఇస్తున్నారు. అయితే సినిమా విడుదల అయితే కానీ తెలీదు ఒకే కథేనా అన్నది .

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి