చంద్రబాబు కుటుంబాన్ని తిట్టడమే నాని పని

0
49
kodali nani abusing cbn
టాలీవుడ్ మూవీ న్యూస్,విజయవాడ-  ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అలాగే అతడి కుటుంబాన్ని అదేపనిగా తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు మంత్రి కొడాలి నాని. ఆంధ్రప్రదేశ్ లో ఏ విషయం తీసుకున్నా సరే ! చంద్రబాబుని తిట్టకుండా ముగించడు ఈ మంత్రి. తాజాగా మరోసారి చంద్రబాబు పై నోరు పారేసుకోవడమే కాకుండా జీవితాంతం చంద్రబాబుని అతడి కుటుంబాన్ని తిడుతూనే ఉంటానని స్పష్టం చేసాడు నాని.

తాజాగా తన నియోజకవర్గమైన గుడివాడలో పర్యటించాడు మంత్రి కొడాలి నాని. ఈ సందర్బంగా మాట్లాడుతూ మరోసారి చంద్రబాబు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతుల వర్షం కురిపించాడు . నేను చంద్రబాబుని తిట్టడం ఆపేది లేదని కుండబద్దలు కొట్టాడు. పేద మహిళల పేరుతో స్థలాల రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని , ఎంతమంది ఎన్ని కేసులు వేసినా వాటిని పరిష్కరించి మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇస్తామని పురుద్ఘాటించారు నాని.

గతంలో కూడా చంద్రబాబుపై దారుణమైన భాషలో తిట్ల దండకం అందుకున్నాడు నాని. అసలు రాజకీయంగా అడుగులు వేసింది తెలుగుదేశం పార్టీలోనే కానీ చంద్రబాబుతో అంతగా పడలేదు దాంతో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక ఇప్పుడేమో మంత్రి కూడా అయ్యాడు కొడాలి నాని. ఎన్టీఆర్ సన్నిహితుడిగా పేరు పడిన నాని చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అంతేకాదు జీవితాంతం కూడా చంద్రబాబుని తిడుతూనే ఉంటానని ఉద్ఘాటించాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి