మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసిన  నాని

0
41
kodali nani comments on modi

టాలీవుడ్ మూవీ న్యూస్,విజయవాడప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని. మోడీ ఒంటరిగానే గుళ్ళు గోపురాలకు వెళ్తున్నాడని , అలా కాకుండా తన భార్యతో కలిసి వెళ్లాలని హితువు పలికాడు నాని. ప్రధాని మోడీ యుక్త వయసులోనే జశోదా బెన్ ని 1968 లో పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్దీ రోజుల్లోనే ఆమెకు దూరంగా రాజకీయ , సేవా కార్యక్రమాలకు దగ్గరగా వెళ్ళాడు. ఇక అప్పటి నుండి ఆమెని కలిసింది లేదు. మోడీ ప్రధాని అయ్యాక జశోదా బెన్ గురించి దేశ ప్రజలకు ఎక్కువగా తెలిసింది.

అయితే మోడీని విమర్శించాలని అనుకునే వాళ్ళు మోడీ భార్యని తెరమీదకు తీసుకొస్తుంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు మంత్రి కొడాలి నాని. ఇలా మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. జగన్ తిరుమల పర్యటన వివాదాస్పదం అవుతుండటమే. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకుంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. జగన్ స్వతహాగా క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు.

టీడీపీ మీద చంద్రబాబు మీద అంతెత్తున లేచే కొడాలి నాని ఈసారి బీజేపీ నాయకులపై మండిపడ్డాడు. అంతేకాదు మోడీ దేవాలయాలకు వెళ్ళినప్పుడు తన భార్యని కూడా తీసుకురావాలని డిమాండ్ చేసాడు. ఏపీ లోని బీజేపీ నాయకుల వ్యవహార శైలి వల్ల మోడీ పరువు పోతోందని , పది మందిని వెంటేసుకొని అమిత్ షా ని పార్టీ లోంచి తొలగించాలని డిమాండ్ చేస్తే తొలగిస్తారా ? అంటూ నేరుగా బీజేపీ నాయకులను ప్రశ్నించాడు కొడాలి నాని. ఎవరి పార్టీ వ్యవహారాలను వాళ్లే చూసుకోవాలని ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అలాగే ముఖ్యమంత్రి గా 6 కోట్ల ఆంధ్రుల తరుపున తిరుమలకు వస్తున్నాడు కాబట్టి జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అయినా డిక్లరేషన్ రద్దు చేయాలనేది నా వ్యక్తిగత డిమాండ్ అంటూ మరో సంచలనం సృష్టించాడు కొడాలి నాని.

మునుపటి వ్యాసంఏపీలో స్టూడియో కడతానంటున్న పోసాని
తదుపరి ఆర్టికల్సిల్క్ స్మిత 24 సంవత్సరాల క్రితం ఇదే రోజున
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి