వైల్డ్ డాగ్ గా వస్తున్న 61 ఏళ్ల మన్మథుడు నాగార్జున

0
48
nagarjuna birthday dp
వైల్డ్ డాగ్ గా వస్తున్న 61 ఏళ్ల మన్మథుడు నాగార్జున

అహిషార్ సొలొమన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున   ఎన్ ఐ ఏ అధికారిగా నటిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్ . అందాల భామలు దియా మీర్జా , సాయామి ఖేర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్ ఐ ఏ అధికారిగా నాగార్జున పట్టిన మిషన్ గన్ చూస్తే ఈ సినిమా ఏ లెవల్ లో ఉండబోతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మిగిలిన 30 శాతం షూటింగ్ ని త్వరలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్ లేకపోతే ఈపాటికి సినిమా విడుదల అయ్యుండేది. కరోనా మహమ్మారి కారణంగా 5 నెలలుగా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా షూటింగ్ జరిగింది. అలాగే ముంబై లో కూడా కొంత పార్ట్ షూటింగ్ జరిగింది. నాగార్జున సీరియస్ రోల్స్ కెరీర్ లో చాలానే చేసాడు కానీ ఎక్కువగా రొమాంటిక్ ఇమేజ్ ఉంది కాని ఈ వైల్డ్ డాగ్ లో మాత్రం కంప్లీట్ యాక్షన్ అండ్ యాక్షన్ అనే అంటున్నారు. అయితే ప్రేక్షకుల కోసం అందమైన ఇద్దరు భామలు ఉన్నారు కాబట్టి కాస్తంత రొమాన్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా వైల్డ్ డాగ్ పోస్టర్ ని విడుదల చేశారు. అలాగే చిత్ర విశేషాలను కూడా వెల్లడించారు. గత మూడు దశాబ్దాలుగా నాగార్జున వెండితెరపై సమ్మోహనంతో ఆకట్టుకుంటున్నాడు. అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తక్కువ కాలంలోనే తన స్వయంకృషితో సత్తా చాటుతూ టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు. స్టార్ హీరోగా గత మూడు దశాబ్దాలుగా రాణిస్తున్నాడు. 61 ఏళ్ల వయసులో కూడా మన్మధుడుగా మహిళల గుండెల్లో మంటలు పెడుతున్నాడు. ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి