చిరంజీవి ఏ పార్టీలో చేరడంటున్న నాగబాబు

0
31
Chiranjeevi is joining the party

అన్నయ్య చిరంజీవి రాజకీయ పార్టీలో చేరడని , ఇకపై సినిమాల్లోనే కొనసాగుతాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగాబ్రదర్ నాగబాబు. చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అందుకు ప్రతిగా చిరు ని రాజ్యసభకు పంపిస్తామని జగన్ ఆఫర్ ఇచ్చాడని రకరకాల పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో నాగబాబు స్పందించాడు. అన్నయ్య చేరాలనుకుంటే రాజకీయ పార్టీ అయినా బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతుందని , రాజ్యసభ కోసం రాజకీయ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని అంటున్నాడు నాగబాబు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి మా కుటుంబం నుండి పవన్ ఒక్కడు చాలు అని అందుకే అన్నయ్య చిరంజీవి సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాడని వివరణ ఇచ్చాడు నాగబాబు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో అన్నయ్య సినిమా చేస్తున్నాడని అలాగే మరో సినిమా కూడా ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపాడు నాగబాబు. విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించాడు నాగబాబు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి