టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగ్ అశ్విన్

0
31
nag ashwin controversial comments on tollywood heros

నేను చేయబోయే సినిమాలో ఒక్క ప్రభాస్ తప్ప మిగతా హీరోలు ఎవరూ చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ప్రభాస్ తో భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసారు నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ పతాకంపై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా చిత్రీకరించాలని భావిస్తున్నాడు నాగ్ అశ్విన్. సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభాస్ మాత్రమే హీరోగా నటించే అర్హత ఉందని మిగతా హీరోలకు లేదని వ్యాఖ్యానించడం మాత్రం మిగతా హీరోలను అవమానించినట్లే !

మిగతా హీరోల సంగతి పక్కన పెడితే ఆయా హీరోల అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవ్వడం ఖాయం. సాహో వంటి ప్లాప్ చిత్రంతో కూడా భారీ వసూళ్ళని సాధించాడు ప్రభాస్. దాంతో అతడి రేంజ్ కు తగ్గ కథతో సినిమా చేస్తే బాక్సాఫీస్ ని కుళ్లబొడవడం ఖాయమని ధీమాగా ఉన్నాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి చిత్రాల తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి