నా 7500 ఎవరిస్తారంటూ కేటీఆర్ ని ప్రశ్నిస్తున్న నటి

0
22
madhavai latha

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్మే నెల కరెంట్ బిల్ 7500 వస్తే ఆన్ లైన్ లో కట్టాను అయినప్పటికీ కట్టలేదు అంటూ మరో బిల్లు పంపించారు అది కూడా కట్టాను ఇప్పుడు నా 7500 రూపాయలు ఎవరిస్తారు సార్ అంటూ తెలంగాణ ఐటీ, మున్సిపల్  శాఖా మంత్రి కేటీఆర్ ని ప్రశ్నిస్తోంది నటి మాధవీలత. నచ్చావులే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామకు గతకొంత కాలంగా సరైన అవకాశాలు లేకుండాపోయాయి తెలుగులో దాంతో అడపా దడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది.


అయితే లాక్ డౌన్ సమయంలో 7500 కరెంట్ బిల్లు వచ్చిందట . ఆ బిల్లుని ఆన్ లైన్ లో కట్టిందట క్రెడిట్ కార్డు ద్వారా అయితే క్రెడిట్ కార్డు వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు ఛార్జ్ చేసారు కానీ కట్టిన కరెంట్ బిల్లు మాత్రం మాకు అందలేదు కాబట్టి మళ్ళీ కట్టాల్సిందే అని ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ మళ్ళీ బిల్లు పంపించిందట. అసలే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిందని బాధపడుతుంటే మళ్ళీ మళ్ళీ కట్టాల్సి రావడం ఏంటి ? అని ఆగ్రహించిన మాధవీలత తన డబ్బులు ఎవరిస్తారు ? అవి ఏమయ్యాయి అంటూ నేరుగా కేటీఆర్ ని ప్రశ్నిస్తోంది.

కేటీఆర్ తో పాటుగా కేసీఆర్ కు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంట్ ని టార్గెట్ చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది మాధవీలత. సినిమాలు అంతగా లేకపోవడంతో గతకొంత కాలంగా రాజకీయాల మీద ద్రుష్టి పెట్టింది. భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది కానీ బీజేపీ వాళ్ళు మాత్రం మాధవీలతని మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు పాపం.

మునుపటి వ్యాసంరాజ్ తరుణ్ సినిమా ఓటీటీలో
తదుపరి ఆర్టికల్ఆ సినిమాలో మహేష్ – విజయ్ లలో నటించేది ఎవరు ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి