నా తండ్రిని బ్రతికి ఉనప్పుడు కనీసం ఒక్కసారి కూడా చూడలేదంటున్న  కూతురు

0
43
TMN logo
TMN logo


నా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా చూడలేదని , చివరకు విగత జీవిగా ఉన్నప్పుడు మాత్రమే కొద్దిసేపు మాత్రమే చూశానని అంటోంది స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి వీరప్పన్. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు లో సైతం భయాన్ని సృష్టించాడు. స్మగ్లర్ వీరప్పన్ పేరు చెబితే చాలు భయకంపితులు అయ్యేవాళ్ళు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు. వీరప్పన్ ని పట్టుకోవాలని వెళ్లిన వాళ్ళు శవాలు అయ్యారు. ఫారెస్ట్ అధికారులను , పోలీసులను అతి కిరాతకంగా చంపాడు వీరప్పన్.

దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసాడు వీరప్పన్. అయితే చివరకు అనారోగ్యంతో చికిత్స కోసం వెళ్తున్న వీరప్పన్ ని అత్యంత నాటకీయంగా మట్టు పెట్టారు పోలీసులు. అలా చనిపోయిన వీరప్పన్ ని చూసింది కూతురు విద్యా రాణి. ఇక ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీలో చురుగ్గా కొనసాగుతోంది. విద్యా రాణి ప్రతిభ కలిగిన వ్యక్తి కావడంతో ఆమెకు కర్ణాటక భారతీయ జనతా పార్టీ యువజన విభాగంకు ఉపాధ్యక్షురాలు గా నియమించారు బిజేపీ అధిష్టానం. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడుతున్నాయి. తనపై విమర్శలు వస్తుండటంతో స్పందించింది. నేను వీరప్పన్ కూతురుని అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా నా తండ్రి బ్రతికున్నప్పుడు చూడలేదని అందువల్ల ఆయన చేసిన చెడు నాకు తెలియదని అంటోంది. నాకు సేవ చేసే అదృష్టం కల్పించిన భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని అంటోంది విద్యా రాణి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి