మర్డర్ ట్రైలర్ వచ్చేసింది

0
46

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రం మర్డర్. ఈరోజు మర్డర్ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు వర్మ. మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమృతా – ప్రణయ్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తన కూతురుని అమితంగా ప్రేమించి ఆమెకు అందమైన జీవితం ఇవ్వాలని ఆశించిన మారుతీ రావు హంతకుడుగా ఎలా మారాడు , ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి ? అన్న కథాంశంతో మర్డర్ చిత్రం తెరకెక్కింది.

నేరస్తుడిగా మారిన మారుతీ రావు ఆత్మహత్య కూడా పెను సంచలనం సృష్టించింది. వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అవేవి తన గౌరవాన్ని కాపాడటానికి ఉపయోగపడలేదు కాబట్టి ,చివరకు కన్న కూతురు కూడా తనని అసహించుకున్న తర్వాత ఇంకా బ్రతకడం దండగ అని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు మారుతి రావు. మిర్యాలగూడలో జరిగిన ఈ సంఘటనలు యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది ఈ సంఘటన. అదే ఇతివృత్తంగా మర్డర్ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఇక ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే టీజర్ , ట్రైలర్ లను రూపొందించినంత అందంగా వర్మ సినిమా ఉండదు అనే నానుడి బలంగా పడిపోయింది. వివాదాస్పద వర్మ మర్డర్ చిత్రంతో మరెంత సంచలనం సృష్టిస్తాడో చూడాలి. ఎందుకంటే అమృత రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా విడుదల అయ్యాక.

మునుపటి వ్యాసంకరోనా భయం లేదా ఈ భామకు
తదుపరి ఆర్టికల్కిక్ శ్యామ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి