మర్డర్ సినిమాపై అభ్యంతరం చెబుతున్న అమృతా

0
53

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా అదే అంశాన్ని కథగా మార్చుకొని తీసిన చిత్రం మర్డర్. పైగా ఈ సినిమాలో పాత్రల పేర్లు అసలు పేర్లు పెట్టాడు వర్మ. దాంతో అమృతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించింది. ఇప్పటికే రెండేళ్ల నుండి చాలా ఇబ్బంది పడుతున్నాను. అది చాలదన్నట్లు వర్మ ఇలా మమ్మల్ని మరింత క్షోభకు గురిచేసేలా మర్డర్ సినిమా చేయడం అంటే మమ్మల్ని మరింతగా అవమానించడమే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అమృతా ప్రణయ్.

మిర్యాలగూడలో అమృత – ప్రణయ్ ల ప్రేమ వివాహం , హత్య , మారుతీ రావు పై కేసు నమోదు , ఆ తర్వాత మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక సినిమాలో కూడా ఆయా పాత్రలకు అవే పేర్లు పెట్టాడు వర్మ. దాంతో అమృతా కోర్టుని ఆశ్రయించింది. ఆగస్ట్ 6 న ఈ కేసుని విచారించనుంది కోర్టు. అమృతా ప్రణయ్ కోర్టుని ఆశ్రయించడంతో నేను కూడా లీగల్ గా తేల్చుకుంటా నని అంటున్నాడు రాంగోపాల్ వర్మ.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి