కన్నడ స్టార్ హీరో యష్ హత్యకు కుట్ర

0
30
murder attempt to hero yash

కన్నడ స్టార్ హీరో యష్ ని హత్య చేయడానికి కుట్ర పన్నిన విషయాన్నీ పోలీసులు కనుగొన్నారు. యష్ ని హత్య చేయడానికి కుట్ర పన్నిన హంతకుడని ఎన్ కౌంటర్ చేసారు. సంచలన సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. రౌడీషీటర్ ని భరత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగుళూర్ తరలించి సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తుండగా ఒక్కసారిగా పోలీసులపైకి తిరగబడ్డాడు దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరుపగా రౌడీషీటర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి దాంతో అతడ్ని ఆసుపత్రికి  తరలించారు.

కానీ అప్పటికే ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. అయితే రౌడీషీటర్ ఏడాదిన్నర క్రితం యష్ ని చంపాలని చూశాడట. గొడవలో భాగంగా యష్ వ్యతిరేకులు రౌడీషీటర్ ని సంప్రదించడంతో యష్ హత్యకు కుట్ర పన్నారట. కన్నడ నాట చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించిన యష్ ఇప్పుడు కన్నడంలో స్టార్ హీరో. ఇక కేజీఎఫ్ చిత్రంతో సంచలన విజయం అందుకుని ఒక్క కన్నడ నాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి