కంగనా రనౌత్ బంగ్లాని కూల్చేసిన ముంబై కార్పొరేషన్

0
51
kangana house demolishing the

టాలీవుడ్ మూవీ న్యూస్, ముంబయ్  –వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ బంగ్లాని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బంగ్లాని కూల్చిన వాళ్ళని బాబర్ తో పోల్చింది. తన బంగ్లా ని కార్పొరేషన్ సిబ్బంది కూల్చుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కంగనా రనౌత్. షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లిన కంగనా రనౌత్ ఈరోజే ముంబైకి చేరుకుంది. ఇక గతకొంత కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వం , శివసేన పార్టీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కంగనా దాంతో శివసేన కంగనా పై కక్ష్య కట్టింది.

అసలు ఒక దశలో కంగనా రనౌత్ ని ముంబై లో అడుగు పెట్టనివ్వమని హెచ్చరికలు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది దాంతో ముంబైలో అడుగుపెట్టింది కంగనా. అయితే 48 కోట్లు పెట్టి కొన్న ఖరీదైన బంగ్లా ని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బంగ్లా ని కూల్చడానికి వచ్చిన కార్పొరేషన్ సిబ్బందిని , పోలీసులను బాబర్ , అతడి సైన్యంతో పోల్చింది. బాబర్ అతడి సైన్యం శ్రీరామ మందిరాన్ని కూల్చివేసినప్పటికీ మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత శ్రీరామ మందిరం నిర్మితం అవుతోందని అలాగే నా బంగ్లా మళ్ళీ కట్టుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది కంగనా రనౌత్.

అయితే కంగనా రనౌత్ బంగ్లా ని కూల్చింది శివసేన కాదని ముంబై కార్పొరేషన్ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని , కంగనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది బృహన్ ముంబై కార్పొరేషన్ మేయర్ కిషోర్ పెడ్నేకర్ అన్నారు. అయితే ముంబై కార్పొరేషన్ కూల్చివేతకు రావడంతో కంగనా కోర్టుని ఆశ్రయించింది. కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పాపం. కంగనా రనౌత్ బంగ్లా ని కూల్చివేశారు. ఈ బంగ్లాని తన కార్యాలయంగా ఉపయోగించుకుంటోంది కంగనా రనౌత్. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి