ముమైత్ ఖాన్ మోసం చేసిందంటున్న క్యాబ్ డ్రైవర్

0
40
mumaith khain

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్సినీ నటి ముమైత్ ఖాన్ తనని మోసం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు క్యాబ్ డ్రైవర్. హైదరాబాద్ కి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు. ముమైత్ ఖాన్ గోవా ట్రిప్ కు నా క్యాబ్ ని తీసుకెళ్లిందని , అయితే మొదట మూడు రోజులు మాత్రమే మాట్లాడకుందని ఆ తర్వాత మరో 5 రోజుల పాటు పొడిగించమని కోరడంతో సరే అన్నానని అయితే అయిన డబ్బుల్లో మొత్తం 15 వేలు తగ్గించి ఇచ్చిందని 15 వేలు ఎందుకు తగ్గిస్తున్నారు అని అడిగితే నేను ఇంతే ఇస్తాను అంటూ కోపానికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

టోల్ గేట్ దగ్గర ఆమె  డబ్బులు కట్టలేదని అక్కడ నేనే ఇచ్చానని , అలాగే డ్రైవర్ బత్తా ప్రతీ రోజు ఇవ్వాల్సిందేనని అయితే మొత్తం 8 రోజులకు గాను ఆ సొమ్ములు కూడా ఇవ్వలేదని అవన్నీ కలిపి 15 వేలు అయ్యాయని వాటితో నాకు సంబంధం లేదని అంటోందని ఆరోపిస్తున్నాడు. త్వరలోనే క్యాబ్ డ్రైవర్ ల సంఘం ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ముమైత్ ఖాన్ పై కేసు పెడతానని అంటున్నాడు క్యాబ్ డ్రైవర్ రాజు.

హాట్ భామ ముమైత్ ఖాన్ తెలుగులో పలు చిత్రాల్లో ఐటమ్ భామగా నటించిన విషయం తెలిసిందే. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది ముమైత్. కొన్నాళ్ల క్రితం వరకు ఐటెం భామగా సంచలనం సృష్టించిన ఈ భామ కు ఇప్పుడు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. తెలుగులోనే కాదు ఇతర బాషల్లో కూడా పెద్దగా ఛాన్స్ లు లేవు. చేతిలో సినిమాలు లేకపోయినా డబ్బు మాత్రం బాగానే ఉంది దాంతో బాగానే ఎంజాయ్ చేస్తోంది. కరోనా సమయంలో కూడా గోవా ట్రిప్ వేసిందంటే ఈ భామ మాములుగా ఎంజాయ్ చేయడం లేదన్న మాట.  

మునుపటి వ్యాసంహీరోగా 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న మెగా హీరో
తదుపరి ఆర్టికల్ప్రభాస్ సినిమాలో నటించడం లేదని తేల్చిన భామ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి