అల్లు అర్జున్ రిలీజ్ చేసిన హీరో మంచు విష్ణు “మోసగాళ్లు ” ట్రైలర్

0
34
mosagallu teaser released

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు చిత్ర టీజర్ ని విడుదల చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 2016 లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. అమెరికాలో అత్యధిక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మోసగాళ్లు చిత్రం. మంచు విష్ణు గతకొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. దాంతో కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేసాడు. ఇక ఈ సినిమాని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , హిందీ , కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మంచు విష్ణు.

ఇక ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే అందాల భామ కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. అయితే అందరికి షాక్ ఇచ్చేలా ఈ చిత్రంలో కాజల్ మంచు విష్ణు చెల్లెలుగా నటించడం. కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్బంగా మోసగాళ్లు పోస్టర్ విడుదల అయ్యింది. ఇక ఈరోజు టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ని అల్లు అర్జున్ విడుదల చేయడం గమనార్హం.

ఇక టీజర్ విషయానికి వస్తే భారీ స్కామ్ చేసే యువతి యువకులుగా మంచు విష్ణు , కాజల్ నటించడం విశేషం. డోనాల్డ్ ట్రంప్ స్పీచ్ తో టీజర్ మొదలు కావడం విశేషం. మొత్తానికి భారీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న మోసగాళ్లు చిత్ర టీజర్ మరింతగా ఆకట్టుకునేలా ఉంది. ఈ టీజర్ తో మోసగాళ్లు చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడేలా ఉన్నాయి. అయితే మంచు విష్ణు కావాలనుకుంటున్న సాలిడ్ హిట్ దక్కించుకుంటాడా ? లేదా ? అన్నది మాత్రం సినిమా విడుదల అయితే కానీ తెలీదు.

 

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి