మోసం చేయడంతో కోపంతో రగిలిపోతున్న సింగర్ సునీత

0
57

చైతన్య అనే వ్యక్తి సింగర్ సునీత మేనల్లుడిని అంటూ సినిమారంగంలో పలువురు ప్రముఖుల వద్ద  డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నాడట. అంతేనా సునీత పేరు వాడుకుంటూ బయట కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడట. అయితే ఈ విషయం ఇన్నాళ్లు సునీత కు తెలియదు లేదు కాబట్టి వాడి ఆటలు సాగాయి….. డబ్బులు కూడా బాగానే గిట్టుబాటు అయ్యేలా చేసుకున్నాడు. అయితే ఈ డబ్బుల విషయం ఈనోటా ఆ నోటా సునీత కు తెలియడంతో షాక్ అయ్యిందట. నాకు చైతన్య అనే మేనల్లుడు లేడు అయినప్పటికీ వాడు నా మేనల్లుడు అని చెప్పగానే ఎలా నమ్ముతున్నారు….. డబ్బులు ఎలా ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సునీత.  సోషల్ మీడియాలో ఓ వీడియో చేసి పెట్టింది. చైతన్య అనేవాడు నాకు కనబడితే పళ్లు రాలగొడతాను అని ఫైర్ అవుతోంది.

సినిమా రంగంలో పలువురు ఇలాగే తన పేరు చెప్పగానే డబ్బులు ఇచ్చారట. ఆ డబ్బులతో కార్యక్రమాలు చేస్తున్నాం అనగానే ఎలా నమ్ముతారు. నమ్మారు సరే ….. కనీసం ఇచ్చేప్పుడైనా ఒకసారి నన్ను అడగొచ్చు కదా ! ఇంత దారుణమైన మోసమా అని కోపంతో రగిలిపోతోంది సునీత. టాలీవుడ్ లో సునీత టాప్ సింగర్ అన్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాలుగా వందలాది సూపర్ హిట్ పాటలను అలపించింది. సునీతకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉండటంతో ఆ పేరు వాడుకుంటూ చైతన్య అనేవాడు బాగానే సొమ్ము చేసుకున్నాడట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి