మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టిన వర్మ

0
62

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆరోజు రాత్రి ఏం జరిగింది అన్న టైటిల్ తో ఈ కొత్త చిత్రం రూపొందనుంది. ఆరోజు రాత్రి ఏం జరిగింది అన్న టైటిల్ ఎవరికి సంబందించిందో తెలుసా….. నందమూరి బాలకృష్ణ కు సంబందించింది. అప్పట్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నందమూరి బాలకృష్ణ ఇంట్లో రాత్రి పూట కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్యులు సత్యనారాయణ చౌదరి గాయపడ్డారు. వెంటనే వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఇద్దరూ బ్రతికి బయటపడ్డారు. అయినా బాలయ్య పై కేసు నమోదు అయ్యింది.

అయితే బాలయ్య అరెస్ట్ కాలేదు కానీ అరెస్ట్ చేసినట్లుగా చూపించారు అంతే. రకరకాల కథనాలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చాయి. పెద్ద హై డ్రామా నడిచింది. అప్పట్లో కాల్పుల ఘటన యావత్ సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. అయితే ఇంతటి సంచలన సంఘటన జరిగినా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బాలయ్య కు అనుకూలంగానే వ్యవహరించింది తప్ప రాజకీయ ప్రత్యర్థి కదా అని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. సరిగ్గా ఇలాంటి కథాంశంతోనే ఆ రోజు రాత్రి ఏం జరిగింది అన్న టైటిల్ తో సినిమా తీస్తున్నాడు వర్మ. అచ్చం బాలయ్య ని పోలిన మనిషి దొరికాడట వర్మ కు. ఇక ఈ సినిమా వస్తే బాలయ్య కు కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే అని చెప్పాలి.

మునుపటి వ్యాసంకొడుకు కోసం విలన్ గా మారుతున్న స్టార్ హీరో
తదుపరి ఆర్టికల్కరోనా వస్తే గాంధీ ఆస్పత్రి లో చేరతానంటున్న మంత్రి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి