ఎన్టీఆర్ సినిమాలో మళ్ళీ ఆ స్టార్ హీరో

0
60

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ పాత్ర జనతా గ్యారేజ్ లో హైలెట్ గా నిలిచింది కట్ చేస్తే ఈ ఇద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందనున్న ఆ చిత్రానికి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని అనుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో రాజకీయ నాయకుడిగా మోహన్ లాల్ నటిస్తే బాగుంటుందని అలాగే మార్కెట్ పరంగా కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నారట ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లు. ఆల్రెడీ జనతా గ్యారేజ్ చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు కాబట్టి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. ఎన్టీఆర్ అంటే మోహన్ లాల్ కు కూడా చాలా ఇష్టం అలాగే సీనియర్ హీరో కాబట్టి మోహన్ లాల్ అంటే ఎన్టీఆర్ కు కూడా అదే గౌరవ భావం ఉంది దాంతో సినిమాలో మరింతగా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు కాబట్టి కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మొదట ఆర్ ఆర్ ఆర్ బ్యాలెన్స్ పార్ట్ ఏదైతో ఉందో దాన్ని పూర్తి చేయనున్నాడు, ఆ తర్వాతే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది అయితే అభిమానులు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ బద్దలు కాలేదు దాంతో ఈ రెండో సినిమా అయినా ఆ లోటు భర్తీ చేస్తుందని ఆశిస్తున్నారు.

మునుపటి వ్యాసంకొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న విజయ్
తదుపరి ఆర్టికల్ఆ హీరో హీరోయిన్  ప్రేమలో ఉన్నారా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి