చంద్రబాబుని ఘోరంగా అవమానించిన మోహన్ బాబు

0
38
mohan babu

 

సంచలన నటుడు మోహన్ బాబు మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగాడు…….. వాడు నాకు నమ్మక ద్రోహం చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అంటూ  దారుణంగా అవమానించాడు. నిన్న వినాయకచవితి పర్వదినం కావడంతో ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు మోహన్ బాబు. ఆ ఇంటర్వ్యూలో చంద్రబాబుపై చాలా దారుణంగా మాట్లాడాడు. నేను వాడు కలిసి వ్యాపారం ప్రారంభించాం , కానీ నన్ను మోసం చేసి ఆ వ్యాపారాన్ని లాక్కున్నాడు. అలాగే నన్ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అయినా చచ్చిన పాముని ఇంకా ఇంకా చంపడం ఎందుకు అని ఊరుకుంటున్నాను కానీ బాధ ఎలా ఉంటుందో దాన్ని అనుభవించిన నాకు మాత్రమే తెలుసు అంటూ ఆవేశం వెళ్లగక్కాడు మోహన్ బాబు.

చంద్రబాబు – మోహన్ బాబు మొదటి నుండి కూడా బంధు మిత్రులే , ఆ తర్వాత ఎన్టీఆర్ అల్లుడు అయ్యాక మరింతగా ఆ బంధుత్వం పెరిగింది. దాంతో అప్పట్లో ఈ ఇద్దరూ కలిసి హెరిటేజ్ అనే డైరీ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. కానీ కొంతకాలం అయ్యాక మోహన్ బాబు వాటా కూడా చంద్రబాబు అంటే చంద్రబాబు భార్య భువనేశ్వరి కొనుక్కుంది. ఇక అప్పటి నుండి మోహన్ బాబు కు చంద్రబాబు కుటుంబానికి దూరం పెరిగింది దానికి తోడు ఎన్టీఆర్ ని గద్దెదించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ! దాంతో మోహన్ బాబుకు కూడా చాలా కోపం అయితే ఎన్టీఆర్ ని గద్దె దించే సమయంలో మోహన్ బాబు చంద్రబాబు వెంటే ఉన్నాడు.

చంద్రబాబు అంటే నిలువెల్లా ఆగ్రహంతో ఊగిపోతున్న మోహన్ బాబు అతడి పేరు ఉచ్చరించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. అయితే అతడ్ని వాడు ……. వీడు అంటూ ఏకవచనంతో సంబోధించడం మరింత వివాదం అయ్యేలా ఉంది. రాజకీయాలలో ఇంతకుముందు అంటే సినిమావాళ్ళకు ఎక్కువగా స్కోప్ ఉండేది కానీ ఇపుడున్న పరిస్థితుల్లో సినిమావాళ్లు ముఖ్యమంత్రి అవ్వడం కష్టమని తేల్చి చెప్పాడు మోహన్ బాబు. సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది కానీ రాజకీయాల్లో అది పెద్దగా ప్రభావం చూపించదని తేల్చేసాడు మోహన్ బాబు.

మునుపటి వ్యాసంఆర్ ఆర్ ఆర్ నుండి ఆ హీరోయిన్ తప్పుకుందట
తదుపరి ఆర్టికల్ప్రభాస్ కు సారీ చెప్పిన మెగా మేనల్లుడు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి