మోడీ సర్కారు సంచలన నిర్ణయం: హరీష్ రావుకు పదవి

0
50
TMN logo
TMN logo

నరేంద్ర మోడీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు ని ఐజిఎస్టీ కమిటీలో స్థానం కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఈ కమిటీ దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న రకరకాల వాణిజ్య పన్నుల వసూళ్లపై సమగ్రంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం కు సిఫారసు చేయనుంది. ఐజిఎస్టీ కమిటీలో ఏడుగురు ఆర్ధిక మంత్రులకు స్థానం కల్పించగా అందులో  హరీష్ కు స్థానం కల్పించడం సంచలనంగా మారింది. ఈ కమిటీ కి బీహార్ ఆర్ధిక శాఖా మంత్రి సుశీల్ కుమార్ మోడీ కన్వీనర్ గా కొనసాగనుండగా హరీష్ సభ్యుడిగా కొనసాగనున్నారు.హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యంత సమర్థవంతంగా తనకు ఇచ్చిన బాధ్యతలను నిర్వహిస్తున్నాడు హరీష్ రావు. అయితే అతడి సామర్ధ్యాన్ని తగిన పదవి , గుర్తింపు లభించలేదని భావిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో హరీష్ రావు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం లో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన వ్యక్తి , శక్తి హరీష్ రావు. సిద్దిపేట నుండి ఎన్నిక అవుతున్న ప్రతీసారి తన మెజార్టీని పెంచుకుంటూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు.

హరీష్ రావు , తన్నీరు హరీష్ రావు , నరేంద్ర మోడీ, ఐజీ ఎస్టీ , రాజకీయ వార్తలు

మునుపటి వ్యాసంచిరంజీవి చిత్రంలో విలన్ ఎవరో తెలుసా ?
తదుపరి ఆర్టికల్పూరి కూతురు కూడా సినిమాల్లోకి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి