మిహీక బజాజ్ కట్టుకున్న లెహేంగా ఎన్ని లక్షలో తెలుసా

0
73
rana

రానా  – మిహీక బజాజ్ లు ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరిగింది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో కేవలం రెండు కుటుంబాల నుండి అలాగే బయటి నుండి కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. మొత్తంగా ఈ వేడుకకు కేవలం 50 మంది మాత్రమే హాజరు అయ్యారు. ఇక ఈ పెళ్లి వేడుకలో మిహీక బజాజ్ కట్టుకున్న లెహేంగా ఎంత ఖరీదో తెలుసా…….అక్షరాల 6 లక్షల రూపాయలు.

అవును మిహీక బజాజ్ వేసుకున్న డ్రెస్ ఆరు లక్షల అట. డిజైన్ మొత్తం చేతి పని మీద అందునా దాదాపు నెల రోజుల పాటు చేయాల్సి వచ్చిందట అందుకే అంతటి ఖరీదు అని తెలుస్తోంది. ఇక డిజైనర్ వేర్ లో మిహీక మరింతగా మెరిసిపోయింది. పెళ్లి కూతురుని చేసినప్పుడు దాదాపు 2 లక్షల విలువైన డ్రెస్ వేసుకోగా పెళ్లికి 6 లక్షల డ్రెస్ వేసుకుంది దాంతో మిహీక బజాజ్ డ్రెస్ ల విషయం వైరల్ అవుతోంది. రానా – మిహీక బజాజ్ ల పెళ్లికి ఆహ్వానించిన వాళ్లకు మొదట కోవిడ్ టెస్ట్ చేసి అందులో నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే లోపలకు ఆహ్వానించారు దగ్గుబాటి సురేష్ బాబు.

మునుపటి వ్యాసండేంజరస్ ఫస్ట్ లుక్ తో ప్రకంపనలు సృష్టిస్తున్న వర్మ
తదుపరి ఆర్టికల్హన్సిక పుట్టినరోజు సందర్భంగా హన్సిక నటిస్తున్న మహా చిత్రం నుండి పోస్టర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి