మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి గిఫ్ట్ రెడీ అవుతోంది

0
56

మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి గిఫ్ట్ రెడీ చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంగా ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ ని అలాగే టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు దర్శక నిర్మాతలు. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా నెల రోజులు పైనే సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ఆచార్య నుండి ఎలాంటి అప్ డేట్ లేకుండా చాలా రోజులు అవుతోంది దాంతో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆచార్య చిత్రం ఫస్ట్ లుక్ ని అలాగే టీజర్ ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.

ఆచార్య చిత్రం ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ అయ్యింది. మళ్లీ సెట్స్ మీదకు వెళ్లబోతున్నాం అని అనుకునే లోపు కరోనా మహమ్మారి వచ్చి పడింది. దాంతో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. ఇప్పట్లో షూటింగ్ లు చేయడం కష్టమే. ఎందుకంటే షూటింగ్ చేద్దామని ధైర్యం చేసిన వాళ్ళు కరోనా బారిన పడ్డారు మరి. ఆ విషయం పక్కన పెడితే మెగా అభిమానులు ఆచార్య చిత్రం నుండి అప్ డేట్ కావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు సరిగ్గా అలాంటి వాళ్ళ కోసమే ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ , టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ వార్త మెగా అభిమానులకు గొప్ప ట్రీట్ అనే చెప్పాలి. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. గతంలో చిరంజీవి – మణిశర్మ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

మునుపటి వ్యాసంఈ హీరో క్రేజ్ ఏంట్రా బాబూ! దిమ్మతిరిగేలా ఉందే
తదుపరి ఆర్టికల్కరోనా అందరికీ వస్తుందంటున్న జగన్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి