నటుడిగా 42 ఏళ్ళు పూర్తిచేసుకున్న మెగాస్టార్

0
33
megastar completed 42 years film industry

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- మెగాస్టార్ చిరంజీవి నటుడిగా దిగ్విజయంగా 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్ళు అయితే విడుదల అయిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. నటుడిగా కెమెరా ముందుకు వచ్చింది పునాదిరాళ్ళు. అయితే అదే సమయంలో ప్రాణం ఖరీదు చిత్రంలో అవకాశం రావడంతో ఆ చిత్రంలో కూడా నటించాడు. ప్రాణం ఖరీదు త్వరగా షూటింగ్ చేసుకొని విడుదల కాగా పునాదిరాళ్ళు మాత్రం కాస్త ఆలస్యంగా విడుదల అయ్యింది దాంతో టెక్నికల్ గా చిరు మొదటి చిత్రం ప్రాణం ఖరీదు అయ్యింది.

ఈ సినిమా 1978 సెప్టెంబర్ 22 న విడుదల అయ్యింది. అంటే సరిగ్గా నేటికి నటుడిగా 42 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాడు చిరంజీవి దాంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 1978 లో నటుడిగా రంగప్రవేశం చేసిన చిరంజీవి అచిర కాలంలోనే టాలీవుడ్ ని ఏలే హీరోగా ఎదిగాడు చిరు. అయితే పున్నమినాగు చిత్రం చిరంజీవిని మరో మెట్టు పై నిలబెట్టింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి మీడియం రేంజ్ హీరో అయ్యాడు. ఇక 1983 లో విడుదలైన ఖైదీ చిత్రం చిరంజీవి నట జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. టాలీవుడ్ టాప్ స్టార్ గా నిలబెట్టింది ఖైదీ చిత్రం.

ఇక అప్పటి వరకు ఉన్న సీనియర్ హీరోలకు భిన్నంగా ఫైట్స్ , డ్యాన్స్ చేస్తూ యువతరంని ఆకట్టుకుంటూ సుప్రీం హీరోగా , మెగాస్టార్ గా నెంబర్ వన్ పొజీషన్ లోకి వచ్చాడు. సినిమారంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరు స్వయంకృషితో నెంబర్ వన్ హీరోగా మూడు దశాబ్దాలుగా రాణిస్తూనే ఉన్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2021 లో విడుదల కానుంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి