గుండు చేయించుకొని షాక్ ఇచ్చిన చిరంజీవి

0
20
mega star chiranjeevi new look

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- మెగాస్టార్ చిరంజీవి గుండు చేయించుకొని షాక్ ఇచ్చాడు మెగా అభిమానులకు. తాజాగా గుండు చేయించుకొని ఫోటోకి ఫోజు ఇవ్వడమే కాకుండా ఈ లుక్ ఎలా ఉందో టెస్ట్ చేయాలనీ భావించాడేమో అందుకే తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు చిరు. అంతేనా అర్బన్ మాంక్ ( సిటీ సన్యాసి ) మరి సిటీ సన్యాసిలా ఆలోచించగలనా ? అంటూ ఓ ప్రశ్నని కూడా వదిలాడు చిరు. అంటే మెగాస్టార్ చిరంజీవి తన గుండు గెటప్ ని ఆచార్య కోసం ట్రై చేస్తున్నాడా ? లేక ఆచార్య తర్వాత చేయబోయే సినిమా కోసం ట్రై చేస్తున్నాడా ? అన్నది తేలాల్సి ఉంది.

మొత్తానికి గుండు గెటప్ లో మాత్రం చిరంజీవి కనిపించడం ఖాయం అయితే అది ఆచార్య చిత్రమా ? లేక ఆ తర్వాత చిత్రమా ? అనేది పక్కన పెడితే గుండు బాస్ గా కనిపించడం మాత్రం ఖాయం. గుండుతో ఉన్న చిరు చిరు గడ్డంని అలాగే ఉంచుకున్నాడు అలాగే మీసం కూడా ఉంది దానికి తోడు కళ్ళజోడు కూడా పెట్టుకొని స్టైలిష్ లుక్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ గెటప్ చూసి మెగా అభిమానులు కొంతమంది షాక్ అవుతుంటే మరికొంత మంది మాత్రం మా బాస్ ని గుండు బాస్ గా చూసే అదృష్టం ఇస్తున్నాడు అంటూ సంతోషించేవాళ్ళు కూడా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కోవిడ్ నిబంధనలను అనుసరించి తగు జాగ్రత్తలతో సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట చిరు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర కథ పై ఇటీవల రగడ మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతానికైతే కాపీ కథ విషయం పక్కన పడింది. ఇక సినిమా విడుదల అయ్యాక కానీ తెలీదు కాపీ విషయం గురించి.

మునుపటి వ్యాసంచంద్రబాబు కుటుంబాన్ని తిట్టడమే నాని పని
తదుపరి ఆర్టికల్మహేష్ అభిమాని మృతి :మహేష్ బాబు తీవ్ర ఆవేదన
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి