మెగా మేనల్లుడు సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే

0
44
uppena movie may be sankranthi2021

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్  తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ” ఉప్పెన ”. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమాతో. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించింది. అలాగే కీలక పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించాడు. చంద్రబోస్ , శ్రీమణి అందించిన పాటలకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదల కావాల్సి ఉండే ఈలోపునే కరోనా మహమ్మారి దాడి చేయడంతో విడుదల ఆగిపోయింది.

కట్ చేస్తే ఆరునెలలుగా కరోనా వల్ల థియేటర్ లన్ని మూతబడ్డాయి. ఇంకా ఎప్పుడు థియేటర్ లు ఓపెన్ అవుతాయో తెలియడం లేదు. ఒకవేళ థియేటర్ లు ఇప్పడు ఓపెన్ అయినా జనాలు భయపడకుండా థియేటర్ కు వస్తారన్న నమ్మకం కూడా లేదు. దాంతో ఓటీటీలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసారట కానీ కొత్తగా పరిచయం అవుతున్న హీరో అలాగే కొత్తగా పరిచయం అవుతున్న డైరెక్టర్ సినిమా కాబట్టి ఓటీటీ వాళ్ళు చెప్పే రేటు నచ్చలేదట మేకర్స్ కి దాంతో ఆలస్యం అయినా ఫరవాలేదు థియేటర్ లోనే సినిమాని విడుదల చేద్దాం అని గట్టిగా నిర్ణయించుకున్నారట.

అంటే ఈ లెక్కన 2021 సంక్రాంతి రేసులో ఉప్పెన విడుదల అవ్వడం ఖాయం. సంక్రాంతికి ముందు కానీ లేదంటే సంక్రాంతి తర్వాత కానీ ఉప్పెన విడుదల ఉండొచ్చు అని తెలుస్తోంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఎలాగూ ఉంటాయి అందుకే వాటి విడుదలను బట్టి కాస్త ముందు లేదంటే తర్వాత విడుదల చేయాలి అనే నిర్ణయానికి వచ్చారట. మొత్తానికి చిరు మేనల్లుడికి వెయిటింగ్ బాగానే పడుతోంది పాపం. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి