చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో షాక్ అవుతున్న మెగా ఫ్యాన్స్

0
31
chiranjeevi next with mohair Ramesh

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆచార్య చిత్రం పూర్తి కాకుండానే మరో రెండు రీమేక్ చిత్రాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒక సినిమా మలయాళం రీమేక్ కాగా మరొకటి తమిళ రీమేక్. అయితే తమిళ చిత్రమైన వేదాళం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఆ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఈ కాంబినేషన్ గురించి ఊహాగానాలు మాత్రమే వినిపించేవి కానీ తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ తో అది నిజమే అని తేలింది దాంతో చిరంజీవి తప్పు చేస్తున్నాడా ? అన్న చర్చ మొదలైంది.

సెప్టెంబర్ 2 న పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు దర్శకుడు మెహర్ రమేష్. దానికి ప్రతిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ చేసిన ట్వీట్ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. మీరు చిరంజీవి గారితో చేయబోయే సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేసాడు పవన్ దాంతో షాక్ అవ్వడం మిగతవాళ్ళ వంతు అయ్యింది. మెహర్ రమేష్ ఇంతకుముందు మహేష్ బాబుతో బాబీ అనే సినిమా తీసాడు అది డిజాస్టర్ అయ్యింది. అలాగే ఎన్టీఆర్ తో శక్తి అనే సినిమా తీసాడు అది ఇంకా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా వల్ల వైజయంతి మూవీస్ బ్యానర్ కొద్ది సంవత్సరాల పాటు మూసేయ్యాల్సి వచ్చింది శక్తి కి వచ్చిన నష్టాల వల్ల. అలాగే ప్రభాస్ తో బిల్లా అనే సినిమా తీసాడు మెహర్ రమేష్ . ఈ సినిమా కాస్త ఫరవాలేదు అనిపించింది. ఇది కూడా నష్టాలే తెచ్చింది కానీ స్టైలిష్ ఫిల్మ్ గా ప్రభాస్ కెరీర్ లో నిలిచింది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో షాడో అనే సినిమా చేసాడు . ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి కాబట్టి ఆ తర్వాత అతడికి మరెవరూ ఛాన్స్ లు ఇవ్వలేదు. దాంతో దర్శకుడిగా మెహర్ రమేష్ వెనుకబడ్డాడు. ఎవరు కూడా కావాలని ప్లాప్ సినిమాలు చేయరు కానీ మెహర్ రమేష్ ఎంచుకున్న సినిమాలు మరీ దారుణంగా ప్లాప్ అవ్వడంతో ఒక బ్రాండ్ పడిపోయింది పాపం. దర్శకుడు గా మంచి విజన్ ఉంది కాని కథని , కథనం ని సరిగ్గా ఎంచుకోలేక పోతున్నాడు మెహర్ రమేష్. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అంటే గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. మరి ఈ చాన్స్ పక్కాగా ఉపయోగించుకుంటే మంచి డైరెక్టర్ గా నిలబడతాడు. లేదంటే చిరంజీవి చేజేతులా చేసిన తప్పు అని తేలుతుంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి