మెగా డాటర్ నిహారిక ఎంగేజ్ మెంట్

0
47

హారిక ఎంగేజ్ మెంట్ ఎప్పుడో తెలుసా

మెగా డాటర్ నిహారిక ఎంగేజ్ మెంట్ కు రంగం సిద్ధమైంది. గుంటూరు కి చెందిన జొన్నలగడ్డ చైతన్య తో ఆగస్టు 13 న నిహారిక వివాహ నిశ్చితార్థం జరుగనుంది. ఇప్పటికే చైతన్య – నిహారిక ల పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆగస్టు 13 న ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరుగనుంది. ఇక పెళ్లి మాత్రం డిసెంబర్ లో చేయాలని నిర్ణయించారట. అంటే నిహారిక పెళ్లి కూడా ఇదే ఏడాదిలో అవ్వడం ఖాయం అన్నమాట. కరోనా ఉధృతి కారణంగా ఈ ఏడాది వద్దనుకున్నారు మొదట. కానీ నిహారిక – చైతన్య ల స్పీడ్ చూసి ఈ ఏడాది లోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

దాంతో డిసెంబర్ లో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయనున్నారట. టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు అవుతున్నాయి. ఇప్పటికే నితిన్ , నిఖిల్ ల పెళ్లి కాగా ఆగస్టు 8 న రానా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఇదే సమయంలో నిహారిక ఎంగేజ్ మెంట్ అవుతోంది. నాగబాబు కూతురు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక నటిగా నిరూపించుకుంది కానీ సక్సెస్ కాలేకపోయింది. దాంతో సినిమాలకు స్వస్తి పలికి పెళ్లికి సిద్ధమైంది. నిహారిక మామగారు పోలీసు ఆఫీసర్ కావడం గమనార్హం. ఇక కాబోయే వాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో.

నిహారిక, జొన్నలగడ్డ చైతన్య , నాగబాబు , మెగా డాటర్ , ఫిల్మ్ న్యూస్

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి