నిహారిక ఎంగేజ్ మెంట్ జరిగింది

0
33
mega daughter

మెగా డాటర్ నిహారిక ఎంగేజ్ మెంట్ మొత్తానికి ఈరోజు జరిగింది. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్య తో నిహారిక వివాహ నిశ్చితార్థం సాంప్రదాయ బద్దంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్న ఈ వేడుకలో మెగా కుటుంబం అంతా పాల్గొంది. చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ లతో పాటుగా జొన్నలగడ్డ కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నిహారిక పెళ్లి కూతురు గెటప్ లో అదిరిపోయేలా ఉందట. అసలే అందగత్తె ఆపై వివాహ నిశ్చితార్థం కాబట్టి మరింత అందంగా ఉందని అంటున్నారు.

నాగబాబు కూతురు అయిన నిహారిక సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తండ్రి నాగబాబు మాటకు కట్టుబడి పెళ్ళికి ఒప్పుకుంది. తనకు నచ్చిన వరుడు దొరకడంతో సంతోషంగా పెళ్ళికి ఒప్పుకుంది. అయితే ఈరోజు ఆగస్టు 13 న నిహారిక వివాహ నిశ్చితార్థం జరిగింది కానీ పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా వెల్లడించలేదు. బహుశా మంచి ముహుర్తాలు చూసుకొని ఈ ఏడాది లోనే అంటే దసరా లోపు లేదంటే డిసెంబర్ లో నిహారిక పెళ్లి అవ్వడం ఖాయమని తెలుస్తోంది. 

మునుపటి వ్యాసంపవన్ కళ్యాణ్ కొత్త సినిమా సురేందర్ రెడ్డితో
తదుపరి ఆర్టికల్మరో బోల్డ్ చిత్రంలో ఈషా రెబ్బా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి