కాబోయే భర్తతో జిమ్ చేస్తున్న నిహారిక

0
42
niharika with fiancé

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్మెగా డాటర్ నిహారిక తనకు కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి జిమ్ చేస్తూ సందడి చేస్తోంది. గుంటూరు జిల్లా కు చెందిన పోలీస్ అధికారి తనయుడు ఈ జొన్నలగడ్డ చైతన్య. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లి ఇదే ఏడాది జరగాల్సి ఉండే కానీ కరోనా మహమ్మారి వల్ల పెద్ద ఎత్తున పెళ్లి చేసుకునే అవకాశం లేదు కాబట్టి వివాహ నిశ్చితార్థం మాత్రం చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం 2021 లో చేసుకోనున్నారట.

ఇక ఎంగేజ్ మెంట్ అయ్యింది అంటే సగం పెళ్లి అయినట్లే అందుకే నిహారిక తనకు కాబోయే వాడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. జంటగా తిరగడం వల్ల ఒకరినొకరు మరింతగా తెలుసుకునే అవకాశం ఉంది కనుక ఇలా జంటగా తిరుగుతూ చూపారులకు కనువిందు చేస్తున్నారు. ఇక వర్కౌట్ కూడా చేయాలి కాబట్టి జిమ్ లో బాగానే కష్టపడుతున్నారు జంటగా. చైతన్యతో కలిసి నిహారిక జంటగా జిమ్ కెళ్తూ బాగానే కష్టపడుతోంది.

నిహారిక – చైతన్య లు జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఇద్దరు కూడా చూడముచ్చటగా ఉండటంతో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. నిహారిక హీరోయిన్ గా సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేసింది కానీ ఈ భామ నటించిన చిత్రాలు అంతగా విజయం సాధించలేదు దాంతో హీరోయిన్ గ కెరీర్ ముగిసింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నటిగా మాత్రం తన సత్తా చాటింది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి