మాస్క్ ప్రాధాన్యత చెబుతూ చిరు చేసిన వీడియో వైర

0
51

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ముఖానికి మాస్క్ ఎంత అవసరమో చాటి చెబుతూ మెగాస్టార్ చిరంజీవి చేసిన చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా హీరోయిన్ ఈషా రెబ్బా, హీరో కార్తికేయ నటించారు. తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోలలో చక్కని సందేశాన్ని అందించారు చిరు. ఆడవాళ్లు అందంగా తయారై లిప్ స్టిక్ పెట్టుకునే కంటే ముఖం పై మాస్క్ ధరించడం ద్వారా , సోషల్ డిస్టన్స్ ద్వారా కరోనాని తరిమి కొట్టొచ్చు మనల్ని మనం కాపాడుకోవచ్చు అని స్పష్టం చేశారు. ఈ వీడియోలో చిరుతో పాటుగా ఈషా రెబ్బా నటించడం విశేషం.అలాగే మరో వీడియోలో హీరో కార్తికేయ , చిరంజీవి నటించారు. మీసం మెలేయడం కంటే ముఖానికి మాస్క్ చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇలా సందేశాత్మక వీడియో చేద్దామని చెప్పగానే చిరు కోసం ఈషా రెబ్బా , కార్తికేయ ముందుకు వచ్చారట. దాంతో వాళ్ళిద్దరి కృతజ్ఞతలు తెలియజేశాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నాలుగు నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది దాంతో షూటింగ్ లు చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. తాజాగా చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.   

మునుపటి వ్యాసం26 జిల్లాలుగా మారుతున్న ఆంధ్రప్రదేశ్
తదుపరి ఆర్టికల్బ్రేకింగ్ న్యూస్: వరవరరావు కు కరోనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి