మరో టీఆర్ఎస్ ఎం ఎల్ ఏ కు సోకిన కారోనా

0
31
TMN logo
TMN logo

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎం ఎల్ ఏ కు కారోనా సోకింది దాంతో అధికార పార్టీ వర్గాల్లో మరింత కలవరం మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎం ఎల్ ఏ లు మంత్రితో సహా కారోనా బారిన పడ్డారు. కొంతమంది కోలుకున్నారు, మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు వివేకానంద గౌడ్ కు కారోనా సోకింది. ఈ విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారు. ఎం ఎల్ ఏ తో పాటుగా ఎం ఎల్ ఏ భార్యకు అలాగే కొడుకుకు కూడా కారోనా సోకింది దాంతో ముగ్గురు కూడా ఇంట్లోనే వేర్వేరు గదుల్లో ఉంటున్నారు.

డాక్టర్లు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలని సూచించారని , డాక్టర్ ల సలహా మేరకు అలాగే చేస్తున్నామని , మా ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలను , ప్రజలను కోరారు వివేకానంద. తనతో ఈమధ్య కలిసిన వాళ్ళు కారోనా టెస్ట్ లు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు కుత్బుల్లాపూర్ శాసన సభ్యులు వివేకానంద గౌడ్.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి