మరో టీవీ నటుడికి సోకిన కరోనా

0
65

మరో బుల్లితెర నటుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని టీవీ నటుడు భరద్వాజ్ స్వయంగా ప్రకటించడం విశేషం. తనకు కరోనా సోకిందని, అయితే జబ్బు , జ్వరం , దగ్గు లాంటి ఎలాంటి లక్షణాలు కూడా లేవని కానీ పాజిటివ్ వచ్చింది కాబట్టి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నానని , నన్ను ఇటీవల కాలంలో కలిసిన అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని అలాగే బయటకు వెళ్లకుండా హోం ఐసోలేషన్ లో ఉండాలని కోరాడు. తెలుగులో పలు ఛానల్ లలో ప్రసరమైన పలు సీరియల్ లలో నటించాడు భరద్వాజ్.

ఎలాంటి లక్షణాలు లేకున్నా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నా ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు భరద్వాజ్. కరోనా మహమ్మారి వల్ల షూటింగ్ లన్నీ ఆగిపోయిన నేపథ్యంలో సర్కారు కొన్ని సడలింపులు ఇచ్చింది. దాంతో వెంటనే సీరియల్ షూటింగ్ లు , రకరకాల కార్యక్రమాల షూటింగ్ లు మొదలయ్యాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా షూటింగ్ అంటే ఎక్కువ మంది గుమి కూడే అవకాశం ఉండటంతో ఒకరి నుండి ఒకరికి ఇలా పాకుతోంది. ఇప్పటికే పలువురు టీవీ నటీనటులు కరోనా బారిన పడ్డారు.

మునుపటి వ్యాసంఅల్లు అర్జున్ ని ఛాన్స్ అడుగుతున్న బాలీవుడ్ డైరెక్టర్
తదుపరి ఆర్టికల్మహేష్ బాబు తల్లిగా ఆ హీరోయిన్ నటిస్తోందా?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి