ఆ చిత్రంపై ఆశలు పెట్టుకున్న మాళవిక శర్మ

0
42
red movie actress

ఆ చిత్రంపై ఆశలు పెట్టుకున్న మాళవిక శర్మ

రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది హాట్ భామ మాళవిక శర్మ. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన నేల టికెట్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది మాళవిక శర్మ. నేల టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది పాపం కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ భామ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. అయితే సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేదని భావిస్తూ అందాల ఆరబోతతో పిచ్చెక్కించేస్తోంది మాళవిక శర్మ.

గత కొంతకాలంగా మాళవిక శర్మ స్కిన్ షో చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హీట్ పెంచుతోంది. మాళవిక శర్మ అందాలను చూస్తూ కుర్రాళ్ళు , ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా పరవశించి పోతున్నారు……..ఊహలోకాల్లో తేలిపోతున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతానని ఆశించింది కానీ ఈ భామ ఆశలు నీరుగారిపోయాయి. అయితే ఈ భామ ఎక్కడా నిరుత్సాహపడకుండా అందాలను పందెంగా వేస్తూ రేసులో దూసుకుపోవాలని చూస్తోంది.

తాజాగా రామ్ హీరోగా నటించిన రెడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది మాళవిక శర్మ. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండే కానీ కరోనా వల్ల విడుదల కావాల్సిన చిత్రాలన్నీ ఆగిపోయాయి. ఓటీటీ లో రెడ్ చిత్రానికి మంచి ఆఫర్ వచ్చినప్పటికీ ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టాడు హీరో రామ్. థియేటర్ లోనే రెడ్ సినిమా విడుదల అవుతుందని ప్రకటించాడు రామ్. దాంతో రెడ్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది మాళవిక శర్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయితే తప్పకుండా తనకు మంచి జరుగుతుందని భావిస్తోంది మాళవిక శర్మ. థియేటర్లు తెరిచేది ఎప్పుడో ? రెడ్ విడుదల అయ్యేది ఎప్పుడో ? అప్పుడు జనాలు వస్తారో ? లేదో ? పాపం మాళవిక.

మునుపటి వ్యాసంఅల్లు అర్జున్ పుష్ప కథపై కాపీ ఆరోపణలు
తదుపరి ఆర్టికల్పూరి జగన్నాథ్ పై నిప్పులు కక్కుతున్న దళిత సంఘాలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి