మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లో కిలోల కొద్దీ బంగారం ఉందట

0
47

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇంట్లో కిలోల కొద్దీ బంగారమే బంగారం ఉందట.  చెన్నై మహానగరంలో పోయెస్ గార్డెన్ లో జయలలిత అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటికి వేద నిలయం అని పేరు. జయలలితకు పెళ్లి కాకపోవడంతో వారసులు లేరు అలాగే తన బంధువులను కూడా దూరం చేసుకుంది దాంతో పెత్తనం అంతా నిచ్చెలి శశికళదే. జయలలిత బంగ్లా లో ఉన్న విలువైన ఆస్తుల చిట్టా గురించి అలాగే ఇతర ఆస్తుల గురించి కేవలం శశికళ కు తప్ప మరొకరికి తెలియదు.

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయలలిత ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి గా పనిచేసింది దాంతో కోట్ల కొద్దీ ఆస్తులు ఉన్నాయి. ఇక వేద నిలయం ఇంటి విషయానికి వస్తే 14 కేజీలకు పైగా బంగారం ఉందట. అలాగే పెద్ద ఎత్తున వెండి కూడా ఉందట. ఇవి కాకుండా విలువైన సామగ్రి చెప్పడానికి నోరు సరిపోదు రాయడానికి పెన్ను పేపర్ లు సరిపోవంట. హైదరాబాద్, చెన్నై , నగరాలతో పాటుగా చాలా ప్రాంతాల్లో భూములు , షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయి అలాగే కాఫీ తోట కూడా ఉందట. ఇవన్నీ కలిపి వేల కోట్ల ఆస్తి అని అంటున్నారు. ఇన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ వాటిని అనుభవించే వారసులు లేకుండాపోయారు దాంతో ఈ సొమ్ము ఎవరి పరం అవుతుందో ? ఇందులో ఎవరెవరు ఎంతెంత నొక్కేస్తారో అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

మునుపటి వ్యాసంహోం క్వారంటైన్ లోకి మంత్రి ఎర్రబెల్లి
తదుపరి ఆర్టికల్కరోనా బాధితుడిగా బాధలు పంచుకున్నారు అమితాబ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి