మహేష్ రిజెక్ట్ చేసిన ఆ 3 చిత్రాలు కూడా హిట్టే

0
51
mahehs green challenge

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలను రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే అవి సూపర్ హిట్ అయ్యాయి. కాకపోతే ఆ చిత్రాలు హీరోయిజం లేని చిత్రాలు దాంతో తన స్టార్ డం ఎక్కడ వాటికి అడ్డు వస్తుందో ? ప్రేక్షకులు ఆదరించరేమో అన్న అనుమానంతో తిరస్కరించాడు కట్ చేస్తే అవి ఇతర హీరోలు చేయడం సూపర్ హిట్ కావడం జరిగింది. ఇంతకీ మహేష్ బాబు వదులుకున్న ఆ మూడు చిత్రాలు ఏంటో తెలుసా………. ఏమాయ చేసావే , ఫిదా , గ్యాంగ్ లీడర్ చిత్రాలు. ఏమాయ చేసావే చిత్రంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా ఫిదా చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించాడు. ఇక గ్యాంగ్ లీడర్ చిత్రంలో నాని నటించాడు.

తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ మహేష్ బాబు తో సినిమా చేయాలని మహేష్ ని సంప్రదించాడు. కథ విన్న మహేష్ తన కున్న స్టార్ డం కు ఇది సెట్ కాకపోవచ్చు అని భావించి తిరస్కరించాడు. అలాగే ఫిదా చిత్రం కోసం శేఖర్ కమ్ముల మహేష్ బాబు ని కలిసాడు. ఇక్కడ కూడా సేమ్ కథ విన్న మహేష్ చాలా సాఫ్ట్ గా ఉంది కాబట్టి నా ఇమేజ్ కు అంతగా సెట్ కాకపోవచ్చు అని రిజెక్ట్ చేశాడట. ఇక గ్యాంగ్ లీడర్ కథ తీసుకొని విక్రమ్ కుమార్ మహేష్ ని కలిసాడు. విక్రమ్ కు దర్శకుడిగా మంచి పేరు ఉండటంతో కథ విన్నాడు. అయితే ఈ కథ కూడా తనకు అంతగా నప్పేది కాదు కాబట్టి తప్పుకుంటేనే మంచిదని రిజెక్ట్ చేశాడట. కట్ చేస్తే నాగచైతన్య , వరుణ్ తేజ్, నాని ఆ సినిమాలు చేశారు మంచి హిట్ కొట్టాడు. ఏమాయ చేసావే , ఫిదా పెద్ద హిట్స్ గా నిలిచాయి. గ్యాంగ్ లీడర్ మాత్రం హిట్ అయ్యింది. మహేష్ బాబు ఈ మూడు సినిమాలను వదిలేసి మంచి పనే చేసాడు అని అంటారు తెలిసిన వాళ్ళు ఎందుకో తెలుసా……. మహేష్ సూపర్ స్టార్ కాబట్టి. ఆ సినిమాలు చిన్న హీరోలు చేయాల్సినవి కాబట్టి.

మునుపటి వ్యాసంహన్సిక పుట్టినరోజు సందర్భంగా హన్సిక నటిస్తున్న మహా చిత్రం నుండి పోస్టర్
తదుపరి ఆర్టికల్ఎన్టీఆర్ వచ్చినా టీడీపీని కాపాడలేడంటున్న మంత్రి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి