మహేష్ అందాన్ని చూస్తూ అలా ఉండిపోయిందట

0
68
poorna actress

మహేష్ అందాన్ని చూస్తూ అలా ఉండిపోయిందట

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందాన్ని చూస్తూ అలా ఉండిపోయిందట హీరోయిన్ పూర్ణ. ఈ విషయాన్ని పూర్ణ స్వయంగా వెల్లడించడం విశేషం. హైదరాబాద్ కు వచ్చిన తొలినాళ్ళలో కారులో వెళ్తున్నప్పుడు మహేష్ బాబు కటౌట్ చూసిందట పూర్ణ. అబ్బా …… అమ్మాయిలకే అసూయ పుట్టే అందమని మహేష్ కటౌట్, పోస్టర్ లను చూస్తూ అలా ఊహలోకాల్లో తేలిపోయిందట ఈ భామ. మలయాళ భామ అయిన పూర్ణ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించగా కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.

ఇక మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్రంలో కూడా పూర్ణ నటించింది. శ్రీమంతుడు చిత్రంలో పూర్ణ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? శ్రీరాముడు పై ఓ పాటని చిత్రీకరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఎంట్రీ సాంగ్ గా ఉండే ఆ పాటలో నర్తించింది పూర్ణ. భక్తి గీతం కావడంతో మహేష్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ లభించలేదని బాధపడుతోంది పూర్ణ. మళ్లీ నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను అని అంటోంది పూర్ణ.

మలయాళ భామ అయిన పూర్ణ ఇటీవల పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అయితే ఈమెని బుట్టలో వేసుకొని మాయ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాడానికి ఓ మాఫియా ముఠా పెద్ద ప్లాన్ వేసింది పెళ్లిచూపుల పేరుతో అయితే పూర్ణ కు వాళ్లపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించి ఆ ముఠాని అరెస్ట్ చేశారు. దాంతో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటోంది. పెళ్లి అంటేనే భయపడుతోంది పూర్ణ.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి