మహేష్ భామతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్

0
65

మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ కియరా అద్వానీ. భరత్ అనే నేను చిత్రం తర్వాత రాంచరణ్ సరసన వినయ విధేయ రామ అనే చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో ఆ తర్వాత ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కట్ చేస్తే ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన చాన్స్ లభించేలా ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా కియరా అద్వానీ ని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా చిత్రం కావడంతో ఒక్క హీరోయిన్ కాకుండా ఇద్దరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఒక హీరోయిన్ గా దీపికా పదుకునే ని అనుకుంటున్నాడు. అలాగే మరో హీరోయిన్ గా కియరా అద్వానీని తీసుకోవాలని భావిస్తున్నారట. కియరా అద్వానీ కి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్లయితే గొప్ప ఛాన్స్ లభించినట్లే అని చెప్పాలి. ఎందుకంటే ఆమె మిగతా హీరోలతో కలిసి నటించడం వేరు ప్రభాస్ రేంజ్ వేరు మరి. కియరా అద్వానీకి బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది దాంతో ప్రభాస్ సినిమాతో మరో లెవల్ ఇమేజ్ సొంతం అవ్వడం ఖాయం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి