మహేష్ బాబు మాస్టర్ ప్లాన్ అదిరిపోయేలా ఉంది

0
33

వంశీ పైడిపల్లి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా రూపొందించాలనే మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎంతైనా మహేష్ బాబు ఇలాంటి విషయాల్లో మాస్టర్ అనే విషయం మరోసారి రూడీ కాబోతోంది. ఇప్పటికే తన రెమ్యునరేషన్ ద్వారా వస్తున్న సొమ్ముని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టి తన స్థిరాస్తులను పెద్ద మొత్తంలో పెంచుకుంటున్నాడు. తాజాగా ఇతర హీరోలతో సినిమాలు కూడా నిర్మిస్తూ మరింతగా ఆర్జిస్తున్నాడు మహేష్. ఇప్పటికే అడవి శేష్ హీరోగా మేజర్ అనే చిత్రం చేస్తున్నాడు మహేష్.

ఇక ఇప్పుడేమో టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాలు నిర్మించాలనే ఆలోచన చేస్తున్నాడట మహేష్ బాబు. అసలు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించాల్సి ఉంది కాని ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది దాంతో వంశీ పైడిపల్లి తీవ్ర నిరాశలో ఉన్నాడు. దాంతో అతడ్ని సంతృప్తి పరిచేందుకు విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చే యోచనలో ఉన్నాడట మహేష్ బాబు. విజయ్ దేవరకొండకు మహేష్ అంటే ఎనలేని గౌరవం దాంతో దాదాపుగా ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి