టీఆర్పీ రేటింగ్ అదరగొట్టిన మహేష్ బాబు

0
40

టాలీవుడ్ సూపర్ స్టార్ టీఆర్పీ రేటింగ్ లో అదరగొట్టాడు. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం టెలికాస్ట్ అయ్యింది. మొదటిసారి టెలికాస్ట్ అయి మంచి రేటింగ్ తెచ్చుకున్న తర్వాత సెకండ్ టైం కూడా టెలికాస్ట్ అయ్యేక అదిరిపోయే రేటింగ్ రావడం సంచలనం సృష్టిస్తోంది. రెండోసారి టెలికాస్ట్ అయ్యాక ఎంత టీఆర్పీ వచ్చిందో తెలుసా…… 17. 4 రేటింగ్ వచ్చింది దాంతో  ఆ చిత్ర బృందం సంబరాలు చేసుకుంటోంది. మహేష్ బాబు సినిమా వస్తోందంటే చాలు బుల్లితెరపై సంచలనమే. పైగా కరోనా వల్ల లాక్ డౌన్ లో ఉన్నాము కాబట్టి మరింత మంచి రేటింగ్ వచ్చింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మిలిటరీ మేజర్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక 13 ఏళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సరిలేరు నీకెవ్వరు. వెండితెరపై సంచలనం సృష్టించిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించడంతో మహేష్ అండ్ కో చాలా సంతోషంగా ఉన్నారు.

మునుపటి వ్యాసంగ్యాంగ్ స్టర్ వికాస్ దుబె ఎన్ కౌంటర్
తదుపరి ఆర్టికల్బిత్తిరి సత్తి ఏ ఛానల్ లో జాయిన్ అయ్యాడో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి