బిగ్ బాస్ 4 సీజన్ కు మహేష్ బాబు ?

0
33
Mahesh Babu to host in Bigg Boss Telugu 4 season

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్ బాస్ 4 సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి దుమ్మురేపాడు. కట్ చేస్తే రెండో సీజన్ కు హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. ఇక మూడో సీజన్ కు సీనియర్ హీరో కింగ్ నాగార్జున తనదైన మార్క్ తో మరింతగా అలరించాడు.

కట్ చేస్తే ఇప్పుడు సీజన్ ఫోర్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. మళ్ళీ ఎన్టీఆర్ నే చేయమని కోరారట కానీ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో చాలా బిజీ గా ఉన్నాడు ఎన్టీఆర్ . సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఎలాగూ ఉంది అందుకే నో చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో మహేష్ బాబు ని కలిసి భారీ ఆఫర్ ఇచ్చారట. చర్చలు కొలిక్కి వస్తే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. కొత్త సినిమాని మేలో కానీ స్టార్ట్ చేయబోవడం లేదు కాబట్టి ఈలోపు కుదిరితే చేయొచ్చు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి